ఈసారి ఇద్దరు లేదా ముగ్గురి పదవులు ఎగిరిపోతాయ్ : సీఎం జగన్

-

ఏపీ ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి రాష్ట్ర మంత్రులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పనితీరు బాగాలేని ఇద్దరు ముగ్గురు మంత్రులు ఈసారి జరిగే ఎన్నికల్లో టికెట్లు ఎగిరిపోతాయని స్పష్టం చేశారు. పనితీరు మదింపు చేసి.. దాని ఆధారంగానే టికెట్లిస్తామని తెలిపారు. అందుకే మంత్రులంతా తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు.

‘మంత్రులందరూ దూకుడుగా వ్యవహరించాలి. చర్చల్లో చురుగ్గా స్పందించాలి. ప్రతి ఒక్కరి పనితీరుపై ఆడిట్‌ ఉంటుంది’’ అని సీఎం స్పష్టం చేశారు. వెలగపూడిలోని సచివాలయంలో మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు ఈ విషయాన్ని తెలిపారు. ఎలాంటి సందర్భం లేకుండానే ముఖ్యమంత్రి అనూహ్యంగా ఈ అంశాన్ని ప్రస్తావించడంతో మంత్రులు అవాక్కైనట్లు తెలిసింది. ‘’సీఎం ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చినట్లున్నారు. అందువల్లే ఇప్పుడీ హెచ్చరిక చేశారు’’ అని కొందరు మంత్రులు సమావేశం తర్వాత బయట అనధికారిక చర్చల్లో వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version