BREAKING: “వైఎస్సార్ ఈబీసీ నేస్తం” నిధులు విడుదల అయ్యాయి. ఈ మేరకు సీఎం జగన్ రిలీజ్ చేశారు. బనగానపల్లె లో సెంట్రల్ లైటింగ్, ఈబిసి నేస్తం, 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు సీఎం జగన్. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ…ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన 4,19,583 మంది పేద్ద అక్కచెల్లెమ్మలకు రూ.629 కోట్లు నేడు జమ చేసుకున్నామని చెప్పారు.
నేడు అందిస్తున్న రూ. 629 కోట్లతో కలిపి ఇప్పటివరకు కేవలం “వైఎస్సార్ ఈబీసీ నేస్తం” ద్వారా మన ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 1,877 కోట్లు అని తెలిపారు సీఎం జగన్. వైఎస్సార్ ఈబీసీ నేస్తం” ద్వారా 45 నుండి 60 ఏళ్లలోపు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు (ఈబీసీ) ఏటా రూ. 15,000 చొప్పున అదే అక్కచెల్లెమ్మలకు 3 ఏళ్లలో మొత్తం రూ.45,000 ఆర్థిక సాయం చేసినట్లు పేర్కొన్నారు సీఎం జగన్.