బెజవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు సీఎం జగన్. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రకటించారు. ఈ నెల 20న మూలా నక్షత్రం రోజున ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కనకదుర్గమ్మ వారిని దర్శించుకుంటారని తెలిపారు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.
సీఎం జగన్ మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించటం ఆనవాయితీగా వస్తోందని.. ఈ సారి కూడా ఆయనే పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. మూలా నక్షత్రం రోజు అమ్మవారిని లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు దర్శించుకుంటారని అంచనా వేస్తున్నామని వివరించారు. దానికి తగినట్లు అదనపు కౌంటర్లు, తాగు నీరు, ప్రసాదాలు వంటి ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు. మొదటి రోజు చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యాయని.. ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షించుకుంటున్నామని వెల్లడించారు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.