అధికారిక బంగ్లా విషయంలో ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చడ్డాకు ఊరట

-

అధికారిక బంగ్లా విషయంలో దిల్లీ హైకోర్టులో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్‌ చడ్డాకు ఊరట లభించింది. చడ్డాకు కేటాయించిన ప్రభుత్వ బంగ్లాను ఆయన ఖాళీ చేయాల్సిన అవసరం లేదని దిల్లీ ఉన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. గతంలో చడ్డాకు  కేటాయించిన టైప్‌- 7 బంగ్లా రద్దు చేస్తూ…. ఈ ఏడాది మార్చిలో రాజ్యసభ సచివాలయం నోటీసులు జారీ చేసింది.

ఈ నిర్ణయం పై రాఘవ్ చడ్డా పాటియాలా హౌస్‌ కోర్టును ఆశ్రయించారు. బంగ్లా కేటాయింపును రద్దు చేసిన తర్వాత కూడా రాఘవ్‌ చడ్డా అదే ఇంట్లో కొనసాగుతానని చెప్పడం సరికాదని హౌస్‌ కోర్టు వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే చడ్డా ట్రయల్‌ కోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం తీర్పును వెల్లడించింది.

ఇక ఇటీవలే ఎంపీ రాఘవ్ చడ్డా బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రాజస్థాన్​లోని ఉదయ్​పుర్​లో ఓ ప్యాలెస్​లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ ఫొటోలు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేశాయి.

Read more RELATED
Recommended to you

Latest news