ఏం పాలిటిక్స్ భ‌య్‌!  అదే బాబైతే.. డ‌బ్బా కొట్టేవాళ్లు కాదా…?

-

రాష్ట్రంలో ప్ర‌ధాన మీడియా స‌హా.. కొన్ని మీడియా సంస్థ‌లు ఎంత క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయో… చెప్ప‌డానికి తాజాగా జ‌రిగిన ఘ‌ట‌న ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. త‌మ‌కు న చ్చ‌ని నాయ‌కుడు.. తాము క‌ల‌లో కూడా రాకూడ‌ద‌ని త‌ల‌పోసిన పార్టీ ఏపీలో అధికారంలోకి వ‌చ్చే స‌రికి.. స‌ద‌రు మీడియా సంస్థ‌లు.. త‌ల్ల‌డిల్లిపోతున్నాయి. అయ్యో.. బాబుకు ద‌క్కాల్సిన అధికారం.. జ‌గ‌న్‌కు ద‌క్కే సిందేంట్రా అంటూ.. శోక‌ణ్నాలు పెడుతున్నాయి. ఉన్న‌వీ లేనివీ క‌ల‌బోసి.. ప్ర‌బుత్వంపై దుమ్మెత్తి పోసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి.

 

స‌రే! ఎవ‌రికైనా.. న‌చ్చిన మ‌నిషిపై ఉండే మ‌మ‌కారం.. న‌చ్చ‌ని మ‌నిషిపైఎలా ఉంటుంద‌ని భావించాలి. కాబ‌ట్టి ఈ మీడియా సంస్థ‌ల‌ను కూడా త‌ప్పుప‌ట్ట‌లేం అనుకుందాం. జ‌గ‌న్ పాల‌న ఏడాది ముగిసిన సంద ర్భంలో కోట్ల‌కు కోట్లు ప్ర‌క‌ట‌నల రూపంలో గుంజేసిన ఓ ప్ర‌ధాన ప‌త్రిక క‌నీసం ఒక్క‌మాటంటే.. ఒక్క మాట కూడా ఈ ఏడాది పాల‌న‌పై మంచిగా రాసింది లేదు. ఇక‌, మ‌రో ప‌త్రిక‌.. ఎలాగూ త‌మ‌కు ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ ‌డం లేద‌నే దుగ్ధ‌తో .. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విషం క‌క్కేసింద‌నుకోండి! స‌రే! ఏడాది ముగిసినంత మాత్రాన‌.. జ‌గ‌న్ సర్కార్‌పై మేం ఎందుకు క‌థ‌నాలు రాయాలి? అని ప్ర‌శ్నించేవారు కూడా ఉన్నారు.

ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. కానీ, తాజాగా జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని.. సీఎంగా ఆయ‌న దూకుడును మెచ్చుకుం టూ.. జాతీయ స్థాయిలో ఓ స‌ర్వే నిర్వ‌హించారు. దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమం త్రుల్లో వైఎస్‌ జగన్‌ నాలుగో స్థానంతో సీనియర్ల సరసన నిలిచారు.  ‘సీ ఓటర్‌–ఐఏఎన్‌ఎస్‌’ సంయుక్తంగా దేశవ్యాప్తంగా మే నెల చివరివారంలో నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా డాట్‌కామ్‌’  ఈ వివరాలను ప్రముఖంగా ప్రచురించింది. ప్రజాదరణ చూరగొన్న ముఖ్యమంత్రుల్లో తొలి మూడు స్థానాలు పొందిన వారిలో ఇద్దరు తల పండిన సీనియర్లే కావడం విశేషం. యువ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారి సరసన నిలవడం యావత్‌ దేశం దృష్టినీ ఆకర్షిస్తోంది.

నవీన్‌ పట్నాయక్‌ పాలనపై 82.96 శాతం మంది ఒడిషా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. భూపేష్‌ భగేల్‌ పాలనపై 81.06 శాతం మంది ఛత్తీస్‌గఢ్‌ ప్రజలు, పినరయ్‌ పాలనపై కేరళలో 80.28 శాతం సంతృప్తి వ్యక్తమైంది.  ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పాలనపై మొత్తం 78.01 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది జ‌గ‌న్ త‌నంత‌ట తానుగా చేసుకున్న స‌ర్వే కాదు.. త‌నంత‌ట తానుగా ప్ర‌క‌టించుకున్న‌దీ కాదు. ఇది నిష్పాక్షికంగా జ‌రిగిన స‌ర్వేలో తేలిన‌నిజం. కానీ, ఇది ప్ర‌ధాన మీడియాలో ఎక్క‌డా మ‌న‌కు క‌నిపించ‌లేదు. అంతేకాదు.. క‌నీసం చిన్న‌పాటి సింగిల్ కాలం వార్త‌గా కూడా రాలేదు.

ఇదే ఇప్పుడు.. `ఇదేం జ‌ర్న‌లిజం భ‌య్‌!` అనే కామెంట్ల‌కు దారితీసింది. చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్ప‌డు.. ఆయ‌నంతట ఆయ‌నే స్వ‌యంగా స‌ర్వేలు చేసుకుని స‌ర్టిఫికెట్లు ఇచ్చుకున్న‌ప్పుడు ఈ మీడియా సంస్థ‌లు డ‌బ్బాలు కొట్టిన విష‌యం గుర్తుందిగా.. ఇప్పుడు నిజాయితీగా జ‌రిగిన స‌ర్వే చెప్ప‌డానికి కూడా నోరు రాలేదు. వీరంతా ప్ర‌జాస్వామ్యంలో నాలుగో స్తంభాన్ని నిలబెట్టేందుకు అవ‌త‌రించిన పాత్రికేయ పురుషుల‌న్న‌మాట‌!!

Read more RELATED
Recommended to you

Exit mobile version