16 మంది IPSలకు ఏపీ డీజీపీ షాక్.. అక్కడే ఉండాలి..!

-

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పలు కీలక మార్పులను తీసుకొచ్చేందుకు ప్రణాళికలను రచిస్తోంది. అన్ని రంగాలను ప్రక్షాళన చేస్తోంది. తాజాగా 16 మంది ఐపీఎస్ లకు షాక్ ఇచ్చారు ఏపీ డీజీపీ. గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలతో వీరిని ఇటీవల బదిలీ చేశారు. కానీ పోస్టింగులు పెండింగులో పెట్టారు. హెడ్ కార్టర్స్ లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అయితే వీరంతా అందుబాటులో లేకపోవడంతో డీజీపీ తిరుమలరావు సీరియస్ అయ్యారు.

ఐపీఎస్ లు పీఎస్ఆర్ ఆంజనేయులు, సంజయ్, సునీల్ కుమార్ తో పాటు కాంతి రాణా, అమ్మిరెడ్డి, రఘురామిరెడ్డి, విజయరావు, విశాల్ గున్ని, రిషాంత్ రెడ్డి, రవిశంకర్, పరమేశ్వర్ రెడ్డి, రఘువీరారెడ్డి, పాలరాజు, జుషువా, అన్బురాజన్, కృష్ణపటేల్ కి మెమో జారీ చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ తన కార్యాలయంలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అలాగే అటెండెన్స్ రిజిస్టర్ లో డైలీ సంతకాలు చేయాలని మెమోలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news