ఏపీలో ఫ్లెక్స్ లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే.. జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల ఆంధ్రప్రదేశ్ ఫ్లెక్స్ ప్రింటర్స్ అసోసియేషన్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఫ్లెక్సీ పరిశ్రమపై ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అసోసియేషన్ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వం తమను స్మగ్లర్లుగా చూస్తుందని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 10 లక్షల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. అటు ప్రభుత్వం జారీ చేసిన జీవోలో ఫ్లెక్సీల వల్ల ఎలాంటి అనర్ధాలు ఉన్నాయో వివరణ ఇవ్వలేదని ఆంధ్రప్రదేశ్ ఫ్లెక్స్ ప్రింటర్స్ అసోసియేషన్ వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం పై తమకు ఇంకా సమయం కావాలని అసోసియేషన్ కోరింది. అయితే.. దీనిపై ఏపీ సర్కార్ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.