AP: కనుమ రోజును సాధారణ సెలవుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు !

-

AP: ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఉద్యోగులకు బిగ్‌ అలర్ఠ్. కనుమ రోజును సాధారణ సెలవుగా ప్రకటించింది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడ కూటమి సర్కార్‌. ఈ మేరకు కనుమ పండుగ రోజును సాధారణ సెలవు గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.

AP Government has issued an order declaring Kanuma festival day as a general holiday

ఇక ఇది ఇలా ఉండగా..సంక్రాంతి సంబరాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సందడి చేశారు. నారావారిపల్లె సంక్రాంతి సంబరాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు నారా భువనేశ్వరి. గెలుపొందిన మహిళలకు, పిల్లలకు బహుమతులు ప్రధానం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి దంపతులు. ఇక ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి, నందమూరి రామకృష్ణ, నందమూరి వసుంధర, దేవాన్ష్ పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news