ప్రధానోపాధ్యాయుల నిర్లక్ష్యం.. 530 మందికి ఏపీ విద్యాశాఖ నోటీసులు

-

కరోనా తర్వాత డిజిటల్ విద్యకు ప్రాధాన్యత పెరిగింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో అధికంగా డిజిటల్ క్లాసులవైపే మొగ్గు చూపుతున్నారు. అది కుదరని పక్షంలో విద్యార్థులకు నోట్స్​ని డిజిటల్ రూపంలో పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే బైజూస్‌ కంటెంట్‌ను డౌన్‌లోడ్‌ చేసి ఇచ్చేందుకు విద్యార్థుల ఫోన్‌ నంబర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదంటూ పార్వతీపురం మన్యం జిల్లాలో 530 మంది ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ అధికారులు షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. పభుత్వ ఆదేశాల మేరకు ప్రతి విద్యార్థీ తమ మొబైల్ ఫోన్లలో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో జరిగేలా చూడాలని ప్రధానోపాధ్యాయులకు బాధ్యతలు అప్పగించారు.

చాలా మంది విద్యార్థులు పేదవారు కావడంతో వారి ఇళ్లలో స్మార్ట్‌ఫోన్లు లేవు. మరికొందరు తల్లిదండ్రులు వలస వెళ్లిపోయారు. గిరిజన ప్రాంతాల్లో సాంకేతిక సమస్యా వెంటాడుతోంది. ఈ పరిస్థితుల్లో కొన్ని పాఠశాలల వారు ప్రక్రియలో వెనుకబడ్డారు. ఈ నేపథ్యంలో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. విద్యార్థుల ఫోన్‌ నంబర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేయని పాఠశాలలను గుర్తించి, సంబంధిత ప్రధానోపాధ్యాయులకు నోటీసులు ఇస్తున్నామని డీఈవో ఎస్‌డీవీ రమణ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version