భారీగా వృత్తి పన్నును పెంచుతూ ఏపీ సర్కార్ ఆదేశాలు

-

రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునేందుకు ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వృత్తి పన్నును పెంచుతూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వులకు సవరణలు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. కొన్ని కేటగిరీలకు వృత్తి పన్నును పెంచుతూ సవరణ నోటిఫికేషన్‌ జారీ చేసింది. వృత్తి పన్నులకు చెందిన రెండు శ్లాబులకు గానూ ఓ శ్లాబులో వృత్తి పన్నును పెంపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రూ.1250 రూపాయలుగా ఉన్న వృత్తి పన్ను శ్లాబును ప్రభుత్వం రూ.2000కు పెంచింది. అయితే.. ఏడాదికి రూ.2500 మించకుండా వృత్తి పన్ను వసూలు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

రూ.10 లక్షల లోపు టర్నోవర్‌ ఉన్న కాంట్రాక్టర్లు, పరిశ్రమలు, హోటళ్లు, రెస్టారెంట్లకు వృత్తి పన్ను నుంచి మినహాయింపు ఇచ్చింది. రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షలలోపు టర్నోవర్‌ ఉన్న కాంట్రాక్టర్లు, పరిశ్రమలు, హోటళ్లు, రెస్టారెంట్లకు రూ.2వేలు వృత్తి పన్ను విధించింది. రూ.25 లక్షలకు మించి టర్నోవర్‌ ఉన్న కాంట్రాక్టర్లు, పరిశ్రమలు, హోటళ్లు, రెస్టారెంట్లకు రూ.2500 వృత్తి పన్ను పెంచింది. అలాగే సినిమా పరిశ్రమలో పని చేసే వారికి రూ.2500 మేర వృత్తి పన్ను పెంపుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news