గుడ్ న్యూస్ : మళ్ళీ పడిపోయిన బంగారం, వెండి ధరలు..!

-

పసిడి ప్రియులకు శుభవార్త. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర.. నేడు కూడా దిగొచ్చింది. వరుసగా క్షీణిస్తున్న బంగారం ధర చూసి గోల్డ్ లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక బంగారం బాటలో నడిచిన వెండి ధర మరింత పడిపోయింది. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ. 490 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 54,580కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల ధర రూ. 460 తగ్గడంతో రూ. 50,030కు చేరుకుంది.

అయితే వెండి ధర మాత్రం భారీగా పడిపోయింది. కేజీ వెండి ధర రూ. 410 తగ్గిపోయింది. దీంతో ధర రూ. 66,700కు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం రూ.300 మేర తగ్గడంతో రూ.55,310 చేరుకుంది. అలాగే రూ.310 తగ్గుదలతో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,700కి దిగొచ్చింది. ఇకపోతే బంగారం ధర ఔన్స్‌ కు 1936 డాలర్లకు పడిపోయింది. వెండి ధర ఔన్స్‌ కు 26.69 డాలర్లకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news