ఏపీకి కొత్త డీజీపీ.. రేసులో ఐదుగురు ఐపీఎస్ అధికారులు

-

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి త్వరలోనే కొత్త పోలీస్ బాస్ రానున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రానికి కొత్త డీజీపీ ఎంపికపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసింది. మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా, రాజేంద్ర నాథ్‌రెడ్డి,  సుబ్రహ్మణ్యం, కుమార్ విశ్వజిత్ లు కేంద్రానికి పంపిన వారిలో ఉన్నారు. అయితే వీరిలో ముగ్గురు అధికారుల పేర్లను ఎంపిక చేసి కేంద్రం రాష్ట్రానికి పంపనుంది.

ప్రస్తుతం ఏపీ ఇంఛార్జ్‌ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా కొనసాగుతున్నారు. డీజీపీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన వైపు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశం ఉందని సమాచారం.  యూపీఎస్సీ ద్వారా డీజీపీని ఎంపిక చేసి రెండేళ్లపాటు కొనసాగించాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. అయితే మెరిట్ ఆధారంగా చూస్తే.. ఆ లిస్టులో ప్రస్తుత ఇంఛార్జ్ డీజీపీ హరీష్ గుప్తా పేరు తప్పకుండా ఉంటుందని.. మరో రెండేళ్లు ఆయన ఆంధ్రప్రదేశ్ కు డీజీపీగా విధులు నిర్వహించే అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాల సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news