ఫ్లాష్ : ఆనందయ్య కంట్లో వేసే చుక్కల మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్…

-

ఆనందయ్య కంట్లో వేసే చుక్కల మందుకు (k) ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఆనందయ్య “k” మందును ఏపీ ప్రభుత్వం నిలిపి వేయగా.. తాజాగా కరోనా బాధితులకు తక్షణమే “k” మందును పంపిణీ చేయాలంటూ ఏపీ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అంతే కాదు.. కంటి చుక్కల మందుకు సంబంధించి రెండు వారాల్లో నివేదిక అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఆనందయ్య మందు కేసుపై తదుపరి విచారణ ఈ నెల 21కు వాయిదా వేసింది హై కోర్టు.

కాగా నేటి నుంచి ఆనందయ్య మందు పంపిణీ ప్రారంభం అయింది. కంట్లో వేసే ముందుకు సంబంధించిన నివేదికలు రావాల్సి ఉన్నాయంటూ గతంలో ఏపీ ప్రభుత్వం “k” మందుకు అనుమతిని ఇవ్వలేదు. ఈ మందును కమిటీ ముందు చూపించలేదు కాబట్టి దీనికి ఏపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఆనందం ఇచ్చే పి, ఎల్, ఎఫ్ మందులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సిసిఆర్ఆర్ఏఎస్ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆనందయ్య “k”మందుకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news