ఏపీ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట లభించింది. వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ విచారణలో.. ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి కేసులో వల్లభనేని వంశీ అనుచరులను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆయనను కూడా అరెస్ట్ చేయాలనీ భావించారు. కానీ వల్లభనేని వంశీ ఎక్కడ ఉన్నాడు అనే సమాచారం పోలీసులకు లేదు.
కానీ ఈ కేసులో వల్లభనేని ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేసాడు. అయితే తాజాగా వంశీ పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. ఈ నెల 20 వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశం ఇచ్చింది. కోర్టు తీర్పుతో వల్లభనేని వంశీకి ఊరట లభించింది. అలాగే ఈ పిటిషన్ పై తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది న్యాయస్థానం.