మహిళా సంఘాలకు రూ.10 లక్షల ప్రమాద బీమాను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోంది అని మంత్రి సీతక్క తెలిపారు. ఇవాళ స్త్రీనిధి సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సీతక్క మాట్లాడుతూ ఇది స్త్రీనిధి సమావేశం లాగా లేదు.. చెరువుగట్టు వద్ద బతుకమ్మ సంబరాలు చేసుకున్నట్లు ఉందన్నారు. తెలంగాణ ప్రదాత సోనియాగాంధీ మార్గదర్శకంలో మహిళా సాధికారత కోసం మా ప్రభుత్వం పనిచేస్తుంది అని తెలిపారు.
మహిళా సంఘాలు అంటే సమాజంలో గౌరవం పెరిగింది. గ్రామీణ స్థాయిలో 63 లక్షల మందిని మహిళా సభ్యులుగా చేర్పించారు. ఆర్థిక అంశాలతో పాటు మహిళా రక్షణ కోసం మహిళా సంఘాలు పనిచేయాలి. వేధింపుల నుంచి మహిళలకి మహిళా సంఘాలు విముక్తి కల్పించాలి. ఆర్థిక భద్రతతో పాటు సామాజిక భద్రత కల్పించేలా మహిళా సంఘాల పని చేయాలి. మహిళల్లో అభద్రత పోగొట్టేలా త్వరలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం. ఆడవాళ్లు లేకుంటే సృష్టి లేదు అనే ఆలోచన పెరిగేలా అవగాహన కార్యక్రమాలు చేపడతాం. ఎన్కౌంటర్లతో మార్పు రాదు.. వరంగల్ దిశ ఎన్కౌంటర్లతో సమాజం మారలేదు. అందుకే పాఠశాల గదుల్లోనే మార్పు మొదలయ్యేలా పాటాలు బోధిస్తామని తెలిపారు సీతక్క.