దేశానికి ఆహారాన్ని అందించిన రాష్ట్రం నుంచి ఇప్పుడు గంజాయి సరఫరా చేస్తున్నాం – అయ్యన్నపాత్రుడు

-

విశాఖ: గంజాయి నియంత్రణలో వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి ఒడిషా మీద నెట్టేస్తున్నారు ఆరోపించారు మాజీ మంత్రి, టిడిపి నేత అయ్యన్న పాత్రుడు. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు గంజాయి అక్రమ రవాణా గుట్టు మట్టులు అన్నీ తెలుసన్నారు. రాష్ట్రంలో గంజాయి నియంత్రణ కోసం ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో సీఐడీకి పని లేదని.. పొలిటికల్ హెర్రాస్ మెంట్ తప్ప.. వాళ్ళని ఉపయోగించుకోవాలని సూచించారు.

NCB నివేదిక ప్రకారం గంజాయి అక్రమ రవాణాలో ఏపీ నెంబర్ వన్ గా ఉందన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఛార్జ్ షీట్ వేసినవి నాలుగు వేలు అయితే.. ఛార్జ్ షీట్ పడనివి మరో ఆరు వేల కేసులు ఉన్నాయన్నారు. NDPS కేసుల కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటుకు జీవో ఇచ్చి అమలు చేయడంలో విఫలం ఆయ్యారని ఆరోపించారు. దేశానికి ఆహారం అందించిన రాష్ట్రం నుంచి ఇప్పుడు గంజాయి సరఫరా చేస్తున్నామని దుయ్యబట్టారు అయ్యన్నపాత్రుడు. సీఎం ఇంటి కాపలా కోసమే వందలాది మంది పోలీసులు ఉంటే ఇక గంజాయి, డ్రగ్స్ నియంత్రణ సాధ్యం కాదని చెప్పాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news