6 నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటు – మంత్రి నారా లోకేష్

-

6 నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ఏపీ మంత్రి నారా లోకేష్. మంత్రి నారా లోకేష్… ప్రజా దర్బార్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరు నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రజా దర్బారులో లోకేష్ వెల్లడించారు. ప్రజా దర్బారులో పలువురు స్వర్ణకారుల సంఘాల ప్రతినిధులు ఈ అంశాన్ని తీసుకొచ్చారు.

ఇక అనంతరం నారా లోకేష్ మాట్లాడుతూ…. ఆరు నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటుచేసి కార్మికులను ఆదుకుంటామని.. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలేంటి..? ఏ విధంగా ఉండాలి, స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి వివరాలు సమర్పించాలని డిమాండ్‌ చేశారు. మంగళగిరిలో స్వర్ణకార వృత్తిపై ఆధారపడి అనేక మంది జీవనం సాగిస్తున్నారు….మంగళగిరిని గోల్డ్ హబ్ గా రూపొందిస్తామనే హామీకి కట్టుబడి ఉన్నామన్నారు మంత్రి నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news