ఏపీ నుంచి కొత్త ఐపీఎల్‌ టీం – ఏపీ మంత్రి ప్రకటన

-

ఏపీ నుంచి కొత్త ఐపీఎల్‌ టీం రాబోతుందని సంచలన ప్రకటన చేశారు ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. వచ్చే ఐదేళ్ళలో అమరావతి బ్రాండింగ్ తో ఐపీఎల్ టీం సిద్ధం చేస్తామని తెలిపారు. అకాడమీలు సరైనవి మాత్రమే ఉంటాయన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఏ క్రీడలు నిర్వహించినా… క్రీడాకారులకు అన్ని సదుపాయాలు అందిస్తామని తెలిపారు. గ్రామ స్ధాయి క్రీడలకు సంబంధించి చర్చించామని… గత ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్ర పేరిట 46 కోట్లు బజారుపాలు చేససారని ఆగ్రహించారు.

సర్టిఫికేట్ ల కుంభకోణం పై ఒక కమిటీ వేసి మూలాలు వెలికితీసి క్రీడాకారుల జీవితాలలో వెలుగులు నింపుతామని ప్రకటించారు. వచ్చే ఐదేళ్ళలో రాష్ట్రానికి రావాల్సిన వాటా కేంద్రం నుంచీ తేవడానికి ఏర్పాటు చేస్తామన్నారు. జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనడానికి ఇన్సెంటివ్స్ ఇస్తామని వివరించారు. గోపీచంద్ అకాడమీ లాగా అమరావతి, వైజాగ్ లలో అకాడమీలు ఏర్పాటు చేస్తామని వివరించారు. గత ప్రభుత్వం అకాడమీల విషయంలో నిర్లక్ష్యం చేసిందని… క్రీడాపరంగా ఖాళీగా ఉన్న పోస్టులు త్వరలో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. గత ఐదేళ్ళలో క్రీడలను పక్కన పెట్టేసారు..గత మూడు పదులుగా స్కూళ్ళలో క్రీడా ప్రాంగణాలు లేవన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news