ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది – లంకా దినకర్

-

 

 

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో మోడీ మార్క్ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందన్నారు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్. బీజేపీ, టీడీపీ, జనసేన త్రిమూర్తుల కలయికతో రాక్షస సంహారం తథ్యమని…ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో వివిధ పథకాల కోసం 2 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినవేనని వివరించారు. కేంద్రం ఇచ్చిన నిధులు, పథకాలకు పేర్లు మార్చి స్టిక్జర్లు వేసుకుంటున్నారు…గడచిన 5 ఏళ్ళు మోడీ పంపే నిధులకు బటన్ నొక్కడం తప్ప ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని వెల్లడించారు.

AP needs double-engine sarkaar for rapid devpt

నాడు – నేడు నిధులు ఎక్కడ నుండి వచ్చాయో చెప్పే ధైర్యం ఉందా? ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ కార్డులెన్నో చెప్పే ధైర్యం ఉందా? అని నిలదీశారు. అగ్రవర్ణ పేదలకు 10% EWS రిజర్వేషన్ ప్రధాని మోడీ ఇస్తే, రాష్ట్రంలో అమలు పరచలేదు… కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా ఒంగోలు వద్ద కొత్తపట్టణం ఫిషింగ్ హార్బర్ ఎందుకు అడుగు ముందుకు పడలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు అనుమతులిచ్చిన, నిర్మాణ దశలో ఉన్న కాలేజీలు ఎందుకు పూర్తవలేదు… 9 వేల కోట్లు పంచాయితీల నిధులు దారి మళ్లింపుతో గ్రామాల అభివృద్ధిలో తిరోగమనం పట్టాయని చెప్పారు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్.

Read more RELATED
Recommended to you

Latest news