ఏపీలో పెరిగిన పెన్షన్లు.. లిస్టులో ఉన్నది వీరే

-

ap pensions hiked: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత.. పెన్షన్లు పెంపు పై సీఎం చంద్రబాబు నాయుడు సంతకం పెట్టారు. దీంతో… ప్రతినెల 4 వేల రూపాయల పెన్షన్ రాబోతుంది. అయితే పెన్షన్ల పెంపు ఎవరికి ఎలా వస్తుందని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ap pensions hiked

వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు,మత్స కారులు, కల్లుగీత కార్మికులు, డప్పు కళాకారులు, హెచ్ఐవి బాధితులు హిజ్రాలకు 4000 పెన్షన్ అందించనున్నారు. అటు దివ్యాంగులకు గతంలో 3000 రూపాయల పెన్షన్ ఉండేది. ఇకపై 6000 పెన్షన్ అందుకోనున్నారు.

కుష్టుతో వైకల్యం సంబంధించిన వారికి… 6000 పెన్షన్ రాబోతుంది. కిడ్నీ, కాలయం వ్యాధిగ్రస్తులకు, డయాలసిస్ ఉన్నవారికి పదివేల రూపాయల పెన్షన్ రానుంది. మంచానికి పరిమితమైన వృద్ధులకు 15 వేల రూపాయల పెన్షన్ ఇవ్వబోతుంది చంద్రబాబు ప్రభుత్వం. గతంలో వీరికి 5000 రూపాయల పెన్షన్ ఉండేది.

Read more RELATED
Recommended to you

Latest news