సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు ప్రజలకు రీచ్ కావడం లేదు. సైబర్ క్రైమ్ అవేర్నెస్ కోసం ఎలాంటి యాప్ ఎక్కడ కనిపించలేదు. అయితే సైబర్ నేరాలు ఎలా జరుగుతాయో వివరించడానికి కొత్త అప్లికేషన్ ప్రవేశపెట్టాం అని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. 16 రకాల సైబర్ క్రైమ్ గురించి ఇక్కడ వివరిస్తున్నాం. వాయిస్ ద్వారా, టెక్స్ట్ ద్వారా వారికి తెలిసేలా యాప్ తయారు చేశాం. ప్రజలందరికీ సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించాలి.
సైబర్ క్రైమ్ లో ఇన్విస్టిగేషన్ చాలా కష్టం. పోయిన నగదును రికవరీ చేయడం చాలా కష్టం. అందుకే విజయవాడ నగరంలో ఉన్న ప్రతి పౌరుడు సైబర్ సోల్జర్ గా తయారవ్వాలి. సైబర్ క్రైమ్ అవగాహన ప్రోగ్రాములో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. ఇక్కడ విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలుపరిచేందుకు అవకాశం ఉంటుంది. పదిమంది సోల్జర్స్ కు ఒక కమాండర్ ఉంటారు. అయితే ఈ 16 సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి అని కమిషనర్ రాజశేఖర్ పేర్కొన్నారు.