ఏపీ పోలీసులకు హైకోర్టులో చుక్కెదురు…!

-

 

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర పోలీసులను చాచి లెంపకాయ కొట్టినట్లుగా హైకోర్టు ఒక తీర్పు ఇచ్చిందని రఘురామకృష్ణ రాజు తెలిపారు. జనవరి 12వ తేదీన తాను దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పును పోలీసులు అమలు చేయడం లేదని, దీనిపై న్యాయమూర్తి గారు స్పందించి ఎంపీ, ఎమ్మెల్యేలకే ఇటువంటి పరిస్థితి ఉందంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించడం జరిగిందని తెలిపారు. న్యాయమూర్తి గారు ప్రస్తావించిన ఆ ఎంపీ తానేనని, ఏడేళ్ల లోపు జైలు శిక్ష కలిగిన కేసులలో 41 A నోటీసులను జారీ చేసి విచారించాలని సుప్రీం కోర్టు ఖచ్చితమైన మార్గదర్శకాలను జారీ చేసిందని, రాష్ట్ర పోలీసులు ఆ మార్గదర్శకాలను పాటించకపోవడం దురదృష్టకరం అని అన్నారు.

ఇక్కడ ఒక నిబంధన అన్నది లేదని, పైనున్న పాలకులు ఎలా చెబితే అలా నడుచుకునే కొంత మంది పోలీసు అధికారులు ఉన్నారని, పాలకుల బూట్లు నాకే ఆ పోలీసు అధికారులు, పోలీసు వ్యవస్థనే శాసిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. తాను దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పును విధిగా పోలీసులు పాటించాల్సి ఉండగా, పాటించడం లేదని అన్నారు. ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారికి చెందిన గ్రానైట్ ఫ్యాక్టరీలో పోలీసులు తనిఖీలను నిర్వహించారని, ఆ తనిఖీలలో తమకు సహకరించలేదన్న కారణంగా ఏలూరు సాంబశివరావు గారుతో పాటు, ఇతరులపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news