BREAKING : ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల..ఇలా చెక్ చేసుకోండి

-

BREAKING : ఏపీ విద్యార్థులకు అలర్ట్. ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. కాసేపటి క్రితమే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఫలితాలను విజయవాడలో విడుదల చేశారు. ఏపీ పాలిసెట్ పరీక్షకు 1,43,625 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరి ఫలితాలను కాసేపటి క్రితమే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేశారు.

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 87 ప్రభుత్వ, 171 ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 29 బ్రాంచ్ లలో మూడేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు ఈ పరీక్ష నిర్వహించారు. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 1,59,144 మంది విద్యార్ధులు దరఖాస్తు కోగా, వీరిలో బాలురు 96429, బాలికలు 62715 మంది ఉన్నారు. ఇందులో పరీక్ష రాసిన విద్యార్ధుల సంఖ్య 143625 గా ఉంది. ఇందులో పాలీసెట్‌లో 86.35 శాతం ఉత్తీర్ణతగా నమోదు అయింది. ఉత్తీర్ణులైన విద్యార్థులు 1,24,021 కాగా బాలికల్లో 88.90 శాతం, బాలురుల్లో 84.74 శాతం విద్యార్థులు ఉన్నారు.

https://polycetap.nic.in వెబ్ సైట్ లో ఫలితాలు

Read more RELATED
Recommended to you

Latest news