ఏపీలో ఇవాళ, రేపు అతి భారీ వర్షాలు..ఈ జిల్లాలకు హెచ్చరికలు !

-

ఏపీలో ఇవాళ, రేపు అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపి విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందట. తదుపరి 2 రోజులలో పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు,దక్షిణకోస్తా తీరాల వైపు కదులుతుందట. దీని ప్రభావంతో ఇవాళ, రేపు దక్షిణకోస్తా,రాయలసీమలో విస్తృతంగా వర్షాలు పడనున్నట్లు తెలిపింది వాతావరణ శాఖ.

కొన్నిచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది. పలుచోట్ల అతి తీవ్ర భారీవర్షాలు కురిసే అవకాశం ఉందట. ఇవాళ పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీవర్షాలు కురిసే అవకాశం ఉందట. మిగత జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందట. తీరం వెంబడి గంటకు 35-55 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది.

Read more RELATED
Recommended to you

Latest news