కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డి హత్య మరవక ముందే జిల్లాలో మరో దారుణ హత్య జరిగింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సింగిల్ విండో ఛైర్మన్ రాజానర్సింగ రావు తల్లి ప్రేమలతను హత్య చేసారు దుండగులు.

బండరాయితో తలపై కొట్టి చేసి హత్య చేసి.. మృతదేహాన్ని బావిలో పడేశారు దుండగులు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకి ప్రధాన అనుచరుడుగా ఉన్నారు రాజానర్సింగ. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సింగిల్ విండో ఛైర్మన్ రాజానర్సింగ రావు తల్లి ప్రేమలతను హత్య చేసారు దుండగులు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.