తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే టీటీడీ చైర్మన్ గా కరుణాకర్ రెడ్డిని నియమించడంపై ఆంధ్రప్రదేశ్ సాధా పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కరుణాకర్ రెడ్డి నియమకాన్ని వ్యతిరేకిస్తూ టీటీడీ పరిపాలన భవనం కింద సాధు పరిషత్ ప్రతినిధులు నిరసన చేప్టటారు.
సేవ్ తిరుమల, సేవ్ టీటీడీ అంటూ నినాదాలు చేశారు. నడక మార్గంలో వన్య ప్రాణుల నుంచి భక్తులకు సరైన రక్షణ కల్పించలేరా..? అని ప్రశ్నించారు. భక్తులకు ఊత కర్రలు ఇస్తామనడం పై సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసనంద సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరుణాకర్ రెడ్డికి చైర్మన్ పదవీ కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనం వద్ద నిరసన చేశారు. చిన్నారిపై చిరుత దాడికి టీటీడీ బాధ్యత వహించాలని పేర్కొన్నారు. తిరుపతిలో చిరుతల సంచారం ఎక్కువైపోయిన విషయం తెలిసిందే. దీంతో టీటీడీ తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.