ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో… వర్షాలు అస్సలు వదలడం లేదు. ఏపీలోని ప్రతి జిల్లాలో వర్షాలు అలాగే వరదలు వస్తున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతంలో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలు అలాగే వరదలు అనే పద్యంలో అల్లూరి జిల్లా వ్యాప్తంగా.. విద్యా సంస్థలకు హాలిడే ఇవ్వడం జరిగింది. ఈ మేరకు అల్లూరి జిల్లా కలెక్టర్ అధికారిక ప్రకటన చేశారు.
అంతేకాదు వర్షం ఎఫెక్ట్ ఉన్న ఏలూరు జిల్లా భీమడోలు, పెదపాడు మండపల్లి కైకలూరు ఏలూరు మదనపల్లి, కలిదిండి మండలాల్లో కూడా విద్యాసంస్థలకు హాలిడే ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే వర్ష ప్రభావం ఎక్కువ ఉందో అక్కడ ఖచ్చితంగా స్కూళ్ల ను మూసివేస్తున్నారు. ఇక మిగతా ప్రాంతాలలో యధావిధిగా… విద్యాసంస్థలు నడవనున్నాయి.