గోవాకు వెళ్లిన ఏపీ యువకుడిని కొట్టి చంపింది రెస్టారెంట్ మాఫియా. న్యూ ఇయర్ వేడుకలకు గోవాకు వెళ్లిన ఏపీ యువకుడిని కర్రలతో కొట్టి చంపింది ఓ రెస్టారెంట్ మాఫియా. అయితే.. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. నూతన సంవత్సర వేడుకల కోసం తాడేపల్లిగూడెం నుంచి గోవా వెళ్లింది ఎనిమిది మంది స్నేహితుల బృందం.
డిసెంబర్ 29 ఆదివారం అర్ధరాత్రి గోవాలో రెస్టారెంట్‌కు వెళ్లారు యువతీ, యువకులు. డిసెంబర్ 31న అర్ధరాత్రి ఫుడ్ ఆర్డర్ విషయంలో టూరిస్ట్‌లకు గోవా బీచ్లోని ఓ రెస్టారెంట్ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రేట్ల గురించి ప్రశ్నించిన యువకులపై దాడి చేశారట రెస్టారెంట్ నిర్వాహకులు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ రవితేజ అనే యువకుడు.. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడట. ఇక ఈ సంఘటన పై గోవా పోలీసులు..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.