త్వరలో జరుగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను టీడీపీ చీఫ్ చంద్రబాబు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈసారి ఎలాగైనా గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా గెలుపు కోసం ఇప్పటి నుంచే వ్యూహాలను రచిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తూనే..మరోవైపు ఇప్పటి నుంచే ప్రచారాన్ని జోరు పెంచారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకాక ముందే.. రాష్ట్ర వ్యాప్తంగా క్వాంపెయినింగ్ షురూ చేసారు.
రా కదలి రా పేరుతో మాజీ సీఎం ప్రచారం హోరెత్తిస్తున్నారు. టీడీపీ కేడర్ లో నయో జోష్ నింపుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ అరకు నియోజకవర్గంలో రా కదలి రా సభ నిర్వహించారు. ఈ సభకు చీఫ్ గెస్ట్ గా చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గిరిజనులకు సీఎం జగన్ తీరని ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. అరకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఫిక్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో అరకు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరపున సివ్వేరి దొన్ను దొర బరిలోకి దిగుతాడని ప్రకటించేశారు చంద్రబాబు. దీంతో టీడీపీ అభ్యర్థి ఎవరు..? అనే ఉత్కంఠకు తెర పడింది.