తుఫాను ఆగిందని సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఏపీ వెదర్ మేన్ చెబుతున్నారు. ఇంకా ఆయనేమంటున్నారంటే.. తుఫాను గమనం చాలా చాలా మెల్లగా ఉంది. గత 10 గంటల్లో చాలా మెల్లగా బాపట్లకి చాలా దగ్గరలో , మచిలీపట్నానికి దక్షిణ భాగాన తిరానికి దగ్గరగా ఈ తుఫాను ఆగిపోయింది. దీని వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కడప జిల్లా కావచ్చు, నెల్లూరు జిల్లాలో కావచ్చు వర్షాలు అక్కడక్కడ కొనసాగనుంది.
మరో వైపున ఉత్తరాంధ్ర జిల్లాల్లో నిన్నటిలాగానే అప్పుడప్పుడూ 20 నిమిషాల పాటు వర్షాలు పడనున్నాయి. సంబంధిత ప్రభావం కూడా కొనసాగనుంది. కాకినాడ, ఏలూరు, ఉభయగోదావరి, విజయవాడ, కృష్ణా జిల్లాల్లో గాలులతో పాటు అప్పుడప్పుడు కొన్ని భారీ వర్షాలుంటాయి. మరో వైపున ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో మాత్రం భారీ నుంచి అతిభారీ వర్షాలు కొనసానుంది. చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో చినుకులు పడనున్నాయి.