అలా అయితే.. రాహుల్ గాంధీ ని చెప్పుతో కొట్టినట్టు: హరీష్ రావు

-

అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్ట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వర్సెస్ హరీష్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ అయితే గట్టిగా జరిగింది. దక్షిణ తెలంగాణకి కేసిఆర్ తీవ్ర అన్యాయం చేశారని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. అందుకనే అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పుతో కొట్టినట్లు నల్గొండ జిల్లాలోని 12 స్థానాల్లో ఒక్క చోట పార్టీ గెలిచిందని విమర్శించారు హరీష్ రావు.

దీనితో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి మాటలను రికార్డుల నుండి తొలగించాలని హరీష్ రావు స్పీకర్ ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ ని చెప్పుతో కొట్టినట్లు అయితే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని కూడా ఆమోదం లో చెప్పుతో కొట్టినట్లే అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version