కృష్ణాజిల్లాలో దారుణం..ఆంటీతో అక్రమ సంబంధం..ఆగిన పెళ్లి !

-

కృష్ణాజిల్లాలో దారుణం. చోటు చేసుకుంది. ఉయ్యూరులో ఇరువురు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పమిడిముక్కల మండలం శ్రీరంగపురం గ్రామానికి చెందిన కూచిపూడి సతీష్ (25) అదే గ్రామానికి చెందిన నాలి శివమ్మ(28)తో అక్రమ సంబంధం నడుపుతున్నాడు. అయితే…అవనిగడ్డ గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో ఈ నెల 30వ తేదీన కూచిపూడి సతీష్ కు వివాహం జరగనుంది.

crime

ఈ తరుణంలోనే… శివమ్మ భర్త ప్రసాద్…ఆ పెళ్లి శుభలేఖ తీసుకొని అవనిగడ్డ వెళ్లి నీవు చేసుకోబోయే సతీష్ మంచివాడు కాదు అని తెలిపాడు. దీంతో పెళ్లి రద్దు అయినట్లు సమాచారం. ఈ తరుణంలోనే.. మనస్థాపానికి గురైన సతీష్, శివమ్మ ఇద్దరూ ఉయ్యూరులోని జియో పెట్రోల్ బంక్ వెనకాల నిర్మానుష ప్రదేశంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం వారి ఇరువురిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఉయ్యూరు టౌన్ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news