NRI కళాశాలలో దారుణం.. విద్యార్థినిలపై HOD లైంగిక వేధింపులు

-

విశాఖ జిల్లా భీమిలి మండలం సంగివలసలోని NRI కళాశాలలో విద్యార్థినిలపై లైంగిక వేధింపుల సంఘటన చోటుచేసుకుంది. కళాశాలలోని రేడియాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్ తుమ్మల నాగేశ్వరరావు లైంగిక వేధింపులకు పాల్పడటంతో విద్యార్థినులు ఎండాడలోని దిశ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. 

బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. తరగతులు జరుగుతుండగానే ఈ నెల 3న రేడియాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్ తుమ్మల నాగేశ్వరరావు తమను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని కళాశాల డీన్ పివి సుధాకర్ కు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. అంతకుముందే ఓసారి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని మరోసారి డీన్ దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదు చేసి 20 రోజులు అవుతున్నా కనీస చర్యలు చేపట్టకపోవడంతో ఏబీవీపీ కార్యకర్తలతో కళాశాలకు చేరుకుని విద్యార్థినులు వాగ్వివాదానికి దిగారు.

Read more RELATED
Recommended to you

Latest news