గూగుల్ మ్యాప్‌ని నమ్మి.. నట్టేట మునిగారు..!

-

ప్రస్తుతం గూగుల్ మ్యాప్ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రతీ ఒక్కరూ మొబైల్ లో గూగుల్ లొకేషన్ ఆన్ చేసుకొని ఎక్కడికి వెళ్లాలన్న బయలుదేరుతున్నారు. కొన్ని సందర్భాల్లో అది రాంగ్ చూపించడం.. పాత ప్లేస్ లో చెరువు ఉండటం.. దారి లేకపోవడం ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో తరుచూ చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే హుస్నాబాద్ ఓ లారీ డ్రైవర్ అలాగే గూగుల్ మ్యాప్ ని ఫాలో కావడంతో లారీ మల్లన్నసాగర్ లోకి వెళ్లిన విషయం తెలిసిందే.

తాజాగా కేరళలో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది.  హైదరాబాద్‌ నగర వాసులు విహార యాత్ర కోసం అలిప్పీ వెళ్లారు. ఇటీవల భారీ వర్షాలతో చెరువులు, కాల్వలు వరద నీటితో నిండిపోయాయి. అయితే, గూగుల్ మ్యాప్‌పై చూస్తూ వేగంగా డ్రైవ్ చేయడంతో కారు నీటి కాల్వలోకి దూసుకెళ్లింది. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు తాళ్లతో పర్యాటకులను రక్షించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news