ఆంధ్రప్రదేశ్ మెడికల్ షాపులు, ఏజెన్సీలపై డ్రగ్స్ ఇన్ స్పెక్టర్లు, విజిలెన్స్, పోలీస్ అధికారులు దాడులు నిర్వహించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మెడికల్ ఏజెన్సీలు మందుల షాపులపై విజిలెన్స్, డ్రగ్ ఇన్ స్పెక్టర్లు, ఈగల్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. మందుల నాణ్యత రికార్డులను అధికారులు పరిశీలించారు. విజిలెన్స్ ఎస్పీ ఎం.స్నేహిత, డ్రగ్స్ ఏడీ నాగమణి రాజమండ్రి తిరుమల శ్రీనివాస్ మెడికల్ ఏజెన్సీలో అకస్మిక తనిఖీలు చేశారు. మెడికల్ గా ఒకే మోతాదులో వినియోగించే సిరఫ్, ఇంజక్షన్లు మత్తు మందులను కొంత మంది యువత అక్రమంగా వినియోగిస్తోంది.
ఈ నేపథ్యంలో డీజీపీ ఆదేశాలతో మెడికల్ షాపుల్లో నాలుగు ప్రత్యేక బృందాలు అకస్మిక తనిఖీలు చేపట్టాయి. రాజమండ్రి డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా తిరుమల ఏజెన్సీలో విక్రయిస్తున్న ట్రమడాలు మత్తు మందు 255 ఇంజక్షన్లను విజిలెన్స్ ఎస్పీ స్నేహిత పట్టుకున్నారు. యువత కొంత మంది తప్పడుగా వైద్యం కోసం వినియోగించే మత్తు కలిగించే మెడిసిన్స్ విరివిగా వాడుతున్నట్టు సమాచారం.