ఇవాళ జనసేన అభ్యర్థులకు బీ-ఫారాల అందజేత కార్యక్రమం కొనసాగనుంది. ఈ నేపథ్యంలోనే.. జనసేన పార్టీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందచేయనున్నారు పవన్ కళ్యాణ్. 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, రెండు లోక్ సభ స్థానాలకు బీ-ఫారాలు ఈ సందర్భంగా అందచేయనున్నారు పవన్ కళ్యాణ్.

అటు ఏపీలో రాజరాజ్యమంటూ చంద్రబాబు వివాదస్పద పోస్ట్ పెట్టారు. ఇవాళ శ్రీరామ నవమి అన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ శ్రీరామ నవమి పండుగ నేపథ్యంలో చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పారు. త్రేతాయుగం నాటి రామరాజ్యం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం అంటే దానికి కారణం… ప్రజల మనోభావాలకు అనుగుణంగా సాగిన శ్రీరాముని పాలన అంటూ పేర్కొన్నారు.