స్నానానికి వెళ్లి గల్లంతైన ఏడుగురు బీటెక్ విద్యార్థులు..!

-

మాదల వారి గూడెం లింగయాస్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులు ప్రక్కనే ఉన్న చెరువుకి స్నానానికి వెళ్లి గల్లంతు అయ్యారు. ఏడుగురు బీటెక్ ఫైనియర్ ఇంజనీరింగ్ విద్యార్థులు చెరువులోకి సరదాగా స్నానానికి వెళ్లారు. సెల్ఫీల మోజులో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. పాలడుగు దుర్గారావు, జే వెంకటేష్ అను విద్యార్థుల మృతదేహాలు లభ్యం అయ్యాయి.

మృతదేహాలను గన్నవరం జిజిహెచ్కు తరలించారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న రిస్క్యూ సిబ్బంది. ప్రత్యేక బంధాలతో గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటన స్థలానికి విద్యార్థులు తల్లిదండ్రులు చేరుకున్నారు. అసలు మా పిల్లలను కాలేజీ నుంచి ఎందుకు బయటకు వదిలారు.. ఏం జరిగిందని అడిగితే పొంతన లేని సమాధానం చెబుతున్నారు యాజమాన్యం. లక్షల లక్షలు మా రక్తాలు పిండి ఫీజులు వసూలు చేస్తున్న లింగాయాస్ కాలేజీ యాజమాన్యం ఇప్పుడు పూర్తి బాధ్యత వహించాలని, కటిక చీకట్లో విద్యార్థులు తల్లిదండ్రులు రోదనలు కంపనాలు సృష్టిస్తున్నాయి. అయితే ఎవరిని కాలేజీ ప్రాంగణంలోకి అనుమతించవద్దంటూ గేట్లు క్లోజ్ చేసారు సెక్యూరిటీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version