Balayya: తన సోదరితో ప్రేమగా బాలయ్య.. వీడియో వైరల్

-

బాలకృష్ణ, భువనేశ్వరి వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తరుణంలో నారా భువనేశ్వరికి ప్రేమతో పలుకరించారు బాలకృష్ణ. దింతో బాలకృష్ణ, భువనేశ్వరి వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

\

ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చంద్రబాబుకుప ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం బాబును మోదీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. చంద్రబాబు అనంతరం మంత్రులతో గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news