ప్రమాణ స్వీకారం వేళ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు సమక్షంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పట్టరాని ఆనందంలో ఫ్యాన్స్ ఉన్న ఈ సమయంలో డైరెక్టర్ హరీష్ శంకర్ సూపర్ ట్రీట్ ఇచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుంచి ఒక కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు.

స్వాగ్ తో నడుచుకుంటూ వస్తూ.. చేత్తో హెయిర్ను పైకి అంటున్న ఫొటో ఫ్యాన్స్ కి కిక్కిస్తోంది. దీనికి ‘సనాతన ధర్మసంస్థాపనార్థాయ.. సంభవామి యుగే యుగే’ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ చిత్రంలో యువ నటి శ్రీలీల హీరోయిన్గా చేస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో లేదా? వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news