రాజంపేట టీడీపీలో అసమ్మతి సెగ..ఇండిపెండెంట్ బరిలో బత్యాల..!

-

 

కడప జిల్లాలోని రాజంపేట టీడీపీలో అసమ్మతి సెగ నెలకొంది. బత్యాల చెంగల్రాయుడుకు టికెట్ ఇవ్వకపోవడంపై ఆయన అనుచరులు.. భగ్గుమంటున్నారు. అంతేకాదు… ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారట బత్యాల చెంగల్రాయుడు. ఈ మేరకు అర్ధరాత్రి అనుచరులు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని బత్యాల చెంగల్రాయుడుపై అనుచరులు ఒత్తిడి తీసుకొచ్చారట.

Followers pressured Bathyala Chengalrayudu to contest as an independent

మీ నిర్ణయమే నా నిర్ణయమన్నారట బత్యాల చెంగల్రాయుడు. నాలుగేళ్లుగా పార్టీ క్యాడర్ కాపాడుకుంటూ వచ్చిన వారికి ఇచ్చే బహుమానం ఇదేనా..? అంటూ ఫైర్‌ అవుతున్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి టీడీపీలో గుర్తింపు లేదని..అందుకే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని అనుచరులు ఒత్తిడి చేస్తున్నారని బత్యాల చెంగల్రాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news