యూఎన్ లో తెలంగాణ యువకుడి ప్రసంగం

-

స్విట్జర్‌ల్యాండ్‌లోని జెనీవాలో మార్చి 11వ తేదీ నుంచి 23వ తేదీ వరకు 55వ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం బద్లాపూర్‌కు చెందిన సాయి సంపత్‌ పాల్గొన్నారు. ఎంఏ పూర్తి చేసిన ఆయన ఓ స్వచ్ఛంద సంస్థలో ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఎంపికైన సంపత్.. ‘వాతావరణ మార్పు- ఆహార భద్రతపై ప్రభావం’  అనే అంశంపై ఈ సమావేశంలో ప్రసంగించారు.

విదేశీ కలుపు మొక్కల నియంత్రణపై ప్రపంచ దేశాలు అనుసరించాల్సిన అంశాలపై సూచనలు అందించానని సంపత్ తెలిపారు. ఈ సమస్యను అధిగమించేందుకు రసాయనిక  మందులను ఉపయోగించడంతో నేల, నీరు, వాతావరణం కలుషితమవుతోందని వివరించినట్లు వెల్లడించారు. సహజ పద్ధతిలో కలుపు తొలగించేందుకు, ఉపాధి హామీ పథకానికి జోడించాలని కోరినట్లు చెప్పారు. ఎనిమిదేళ్ల పాటు ఈ విధానాన్ని అనుసరిస్తే విదేశీ కలుపు అంతరిస్తుందని అన్నారు. ఈ అంశంతో పాటు విద్య, రోడ్లు, రాజకీయాల అంశాలపై మాట్లాడానని సంపత్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news