పరీక్షలు లేకుండా పదవ తరగతి పాస్ అయిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరో శుభవార్త. ఆంధ్రప్రదేశ్ లోని మోడల్ స్కూల్ లో ఇంటర్ మొదటి సంవత్సరం కు సంబంధించిన అడ్మిషన్ల దరఖాస్తు ప్రక్రియ మొదలు అయ్యింది. రాబోయే విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ కు సంబంధించిన బైపిసి, ఎంపీసీ, సీఈసీ, ఎంఈసీ కోర్సులకు సంబంధించి అడ్మిషన్లు పొందవచ్చు. అయితే ఇందుకు సంబంధించి పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోనే బోధన ఉంటుంది.
మోడల్ స్కూల్ లో ఇంటర్మీడియట్ అప్లికేషన్ల కు దరఖాస్తు ప్రక్రియ నేటి నుండి మొదలైంది. జూలై 31 వ తారీకు దరఖాస్తుకు చివరి తేదీ. ఇందుకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://apms.apcfss.in/ వెబ్ సైట్ లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు నింపిన తర్వాత ఆ కాపీని సంబంధిత కాలేజ్ ప్రిన్సిపల్ కు సమర్పించాల్సి ఉంటుంది. సీట్ల కేటాయింపు విషయంలో కుల వర్గీకరణ బట్టి భర్తీ చేయనున్నారు. ఇందులో కూడా 33 శాతం సీట్లు బాలికలకు కేటాయించనున్నారు.