దారుణం : నాలుగేళ్ల క్రితం అత్యాచారం చేశాడు.. ఇప్పుడు చంపేశాడు..!

యూపీలోని కస్గంజ్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నాలుగేళ్ల క్రితం మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు బెయిల్‌పై విడుదలై బాధితురాలు(17), ఆమె తల్లిని చంపేశాడు. మంగళవారం సాయంత్రం సైకిలుపై ఇంటికి వస్తున్న తల్లీకూతుళ్లపై ట్రాక్టర్‌ ఎక్కించి చంపేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా 2016లో 13 ఏళ్ల బాలికైన బాధితురాలిని నిందితుడు కిడ్నాప్‌ చేసి, అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏడాది అనంతరం 2017 అక్టోబర్‌లో బెయిల్‌పై బయటికొచ్చాడు.

rape attempt
 

అప్పటి నుంచి తనపై కేసు పెట్టిన బాధితురాలి కుటుంబంపై పగ పెంచుకున్నాడు. అదను కోసం ఎదురుచూస్తున్న అతను, తాజాగా.. బాధితురాలు, ఆమె తల్లి సైకిల్‌పై ఇంటికి రావడం గమనించి వారిని ట్రాక్టర్‌తో తొక్కించేశాడు. సైకిల్‌ని అమాంతం ఢీకొట్టడంతో తల్లీ కూతుళ్లు కిందపడిపోయారు. అనంతరం ట్రాక్టర్‌ని వారిపై నుంచి పోనిచ్చి కిరాతకంగా చంపేశాడు. అక్కడినుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.