వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు Vs యుశ్రారైకా ఎంపీ…. కేసుల వెనక ఎంత కథ ఉందో తెలుసా?

-

నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం సాక్షిగా ప్రస్తుతం వైకాపాలో జరుగుతున్న రాజకీయ విన్యాశాలు మామూలుగా లేవు! ఈ రసవత్తర రాజకీయ చదరంగంలో ఎప్పుడు ఏ పావు ముందుకు కదులుతుందో.. ఎవరు “రాజు”కి చెక్ పెడుతున్నారో, ఎలా పెడుతున్నారో ఒకపట్టాన్న అర్ధం కావడం లేదనే చెప్పాలి! తాజాగా వైఎస్సార్సీపీ.. సారీ… వైశ్రారైకా ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వరుసపెట్టి.. ఆయన పార్లమెంటు నియోజకవర్గంలోని ఒక మంత్రి, ఎమ్మెల్యేలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే! కానీ… అసలు ఈ ఫిర్యాధుల వెనుక ఉన్న ఆలోచనలు, ఢిల్లీ స్థాయిలోని వ్యవహారాలపై విశ్లేషణ ఇప్పుడు చూద్దాం!


నిజంగా రఘురామకృష్ణం రాజు ఈ రేంజ్ లో అంత బలమైన పార్టీ అధ్యక్షుడు కం ఏపీ ముఖ్యమంత్రితో ఎకసికాలు ఆడటం.. వెటకారాలు గుప్పించడం ఎంతవరకూ సరైన చర్య? పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలి.. రఘురామకృష్ణంరాజు సమాధానం!

ఒక పార్టీ ఎంపీపై ఆ స్థాయిలో ఎమ్మెల్యేలు విరుచుకుపడటం ఎంతవరకూ సరైన చర్య? వైకాపా ఎంపీ అనే స్థాయి ఆయన ఎప్పుడో దాటిపోయాడు.. జగన్ కష్టంతో గెలిచి, ఏరు దాటాక బోడి మల్లన్న అనేవాళ్లు పార్టీకి అవసరం లేదు.. వైకాపా ఎమ్మెల్యేల సమాధానం!

హస్తినలో జరుగుతున్న కార్యక్రమాల సంగతి కాసేపు స్పీకర్ ఓం బిర్లా కి వదిలేస్తే… రాష్ట్రం విషయనికి వచ్చేసరికి ఇలా మాటల వరకూ మాత్రమే ఉన్న వ్యవహారం కాస్త పోలీస్ స్టేషన్ ఫిర్యాదుల వరకూ వెళ్లింది. ఇక్కడ సరిగ్గా ఆలోచిస్తే… రెండు విషయాలు స్పష్టమవుతున్నాయి!

ఒకటి… వైఎస్ జగన్ లాంటి బలమైన వ్యక్తిపై రఘురామకృష్ణంరాజు ఒంటరి పోరుకు బ్యాక్ బోన్ ఎవరు అంటే… టక్కువ వచ్చే సమాధానం ఆయనకు బీజేపీలో ఉన్న భరోసా అని! కానీ ఇక్కడ సరిగ్గ గమనిస్తే… ఆయన బీజేపీపై భరోసా పెట్టుకున్నారే తప్ప… బీజేపీ నుంచి ఈయన ఆశించిన స్థాయిలో భరోసా రాలేదని స్పష్టం అవుతుంది! అలా కానిపక్షంలో… బీజేపీలోనూ, కేంద్రంలోని బీజేపీ పెద్దలతోనూ ఫిర్యాదులు చేసిన అనంతరం తడిగుడ్డ వేసుకుని పడుకోవాల్సిన ఆర్.ఆర్.ఆర్. హైకోర్టును ఆశ్రయించాల్సిన అవసరం ఏమొచ్చింది?

ఇప్పుడు అదే వైకాపా ఎమ్మెల్యేల ధైర్యంగా చెబుతున్నారు విశ్లేషకులు! నిజంగా రఘురామకృష్ణం రాజు విషయంలో వెనకాల బీజేపీ పెద్దలు, కమల అధిష్టాణం ఉండి ఉంటే గనుక… ఇక్కడ ఏపీలో మంత్రి, ఎమ్మెల్యేలు పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లి కేసులు పెట్టి ఉండేవారు కాదని! అక్కడ బీజేపీ నుంచి ఆర్.ఆర్.ఆర్. కు సరైన సపోర్ట్, ఆశించిన మద్దతు లేనందునే ఈ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆ యుశ్రారైకా ఎంపీపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసేవరకూ వ్యవహారం వెళ్లిందని అంటున్నారు! అదే నిజమైతే… ఆర్.ఆర్.ఆర్. పరిస్థితి రెంటికీ చెడ్డ రేవటే అన్న మాటలు వినిపిస్తున్నాయి!

Read more RELATED
Recommended to you

Latest news