వైఎస్ వివేకా హత్య కేసులో బెయిల్ పై విడుదలైన భాస్కర్ రెడ్డి

-

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో చంచల్ గూడా జైలులో ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి శుక్రవారం ఎస్కార్ట్ బెయిల్ పై విడుదల అయ్యారు. అనంతరం నేరుగా గచ్చిబౌలి ఏఐజి ఆసుపత్రికి వెళ్లిన ఆయన.. అనారోగ్యం దృశ్య వైద్యులను కలిశారు. అనారోగ్యం దృశ్య భాస్కర్ రెడ్డికి 12 రోజులు బెయిల్ ఇచ్చింది సిబిఐ కోర్టు. ఆయన అనారోగ్యంగా ఉన్నట్టు కోర్టుకు చంచల్ గూడా సూపరిండెంట్ రిపోర్ట్ ఇచ్చారు.

దీంతో మెడికల్ ట్రీట్మెంట్ దృశ్య భాస్కర్ రెడ్డికి సిబిఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్ లోనే చికిత్స పొందాలని కోరుతూ ఆదేశాలు జారీ చేసింది. తిరిగి అక్టోబర్ 3న చంచల్గూడా జైలు సూపర్డెంట్ ముందు సరెండర్ కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ విడిచి వెళ్ళవద్దని ఆదేశించింది. భాస్కర్ రెడ్డికి ఎస్కార్ట్ గా ఆర్ఎస్ఐ, నలుగురు కానిస్టేబుళ్లు ఉండనున్నారు. ఇక ఇదే కేసులో నేడు సిబిఐ కోర్టుకు హాజరయ్యారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి తో పాటు మిగిలిన నిందితులు కూడా కోర్టుకు హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news