తిరుపతిలో అపచారం జరిగిన తరుణంలో..పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాల్సిందే అంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి ఫైర్ అయ్యారు. అన్నమయ్య విగ్రహానికి జరిగిన అపచారాన్ని ఖండించారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి. నిందితులను కఠినంగా శిక్షించాలి…. సనాతన ధర్మం అని చెప్పే పవన్ కళ్యాణ్ స్వామి ఇప్పుడు ఎక్కడున్నారని నిలదీశారు.
32 వేల సంకీర్తనలతో వెంకటేశ్వర స్వామి మనసు గెలుచుకున్న అన్నమయ్య విగ్రహానికి అపచారం జరిగితే కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్న ఈ చర్య పై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఏనాడూ ఇటువంటివి జరగలేదని తెలిపారు. స్వామి వారి పవిత్రతను కాపాడిందే తప్ప దిగజార్చలేదని ఆగ్రహించారు.