జగన్ వచ్చాకా చాలా మారిపోతున్నాయి! పద్దతిగా జరుగుతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కార్పొరేట్ ముఖ్యం కాదు అన్నచందంగా పోతున్నాయి అనే మాటలూ వినిపిస్తున్నాయి! గతంలో పదోతరగతి, ఇంటర్ మొదలైన పరీక్షల ఫలితాలు విడుదలయ్యయంటే చాలు… అవి విడుదలయిన ఒక్క నిమిషంలోపే టీవీల్లో గోల మొదలైపోయేది! ఒకటి రెండు మూడు మావే… ఒకటి ఒకటి రెండూ రెండూ అంటూ… మొదటి పదీ మావే.. వందలో 90 మావే.. పదిలో ఐదు మావే అంటూ ప్రకటనలతో హోరెత్తించేవి కార్పొరేట్ విద్యా సంస్థలు. ఫలితాలు వచ్చిన క్షణాల్లోనే యాడ్స్ ఎలా తయారయ్యేవో జనాలకు అర్ధం అయ్యేది కాదు!
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల అయ్యాయి. వాస్తవంగా అయితే ఫలితాలు విడుదల కాకముందే కార్పొరేట్ ప్రెవేట్ కళాశాలల లొల్లి ఉండేది. కానీ తాజాగా విడుదల చేసిన ఫలితాల తర్వాత అలాంటి ప్రకటనలు ఎక్కడ కనిపించలేదు. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కారణంగా తెలుస్తోంది. ఫలితాల వెల్లడిలో అనుసరించిన వ్యూహంతో కార్పొరేట్ కళాశాలల యాజమాన్యానికి షాక్ తగిలిందని అంటున్నారు. దీంతో వారు ప్రకటనలు వేసుకునే అవకాశం లేదు.
దీనికీ తోడు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కళాళాలలు ఇప్పుడే ప్రారంభమయ్యే అవకాశాలు లేవు. వీటి దృష్ట్యా ప్రైవేటు యాజమాన్యాలు ప్రకటనలు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. గతంలో కార్పొరేట్ సంస్థల యజమానులే ప్రభుతంలో పెద్దలుగా ఉండటం వల్లో ఏమో కానీ… అప్పట్లో ఫలితాలు రాకముందే కారొరేట్ విద్యాసంస్థలకు సమాచారం అందేది. అయితే ఈసారి ఫలితాల వెల్లడిలో ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలతో ఆ కళాశాలలకు ఫలితాలు వెంటనే తెలియలేదు. దాంతో… వారి ప్రకటనల గోల నుంచి ప్రజలకు విముక్తి కలిగిందని అంటున్నారు!!