సీఎం చంద్రబాబు ట్విటర్ లో భారీ మార్పులు !

-

ట్విటర్ లో సీఎం చంద్రబాబు నాయుడు బయో మారింది. ఇదివరకు టీడీపీ అధినేత, మెంబర్ ఆఫ్ అసెంబ్లీ అని ఉండగా….తాజాగా దీనికి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని యాడ్ చేశారు. నిన్న నాలుగో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఈ మేరకు మార్పులు చేశారు. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబుకు ట్విటర్ లో 5.1 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఆయన 11 మందిని ఫాలో అవుతున్నారు.

Big changes in CM Chandrababu’s Twitter

కాగా, మంత్రుల సమర్థత. అభీష్టం మేరకే శాఖలు కేటాయించనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్‌ నాశనం చేసిన వ్యవస్థలను బాగు చేయాలని, రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులదే కీలక బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులతో చంద్రబాబు సమావేశమై ఈ వ్యాఖ్యలు చేశారు. ఓఎస్డీలు, పీఏలు, పీఎస్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైసీపీ ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన వారిని చేర్చుకోవద్దని మంత్రులకు చంద్రబాబు సూచించారు.

 

https://x.com/ncbn

Read more RELATED
Recommended to you

Latest news