అమరావతి : ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగులకు బిగ్ షాక్ తగిలింది. ఇవాల్టి నుంచే ఏపీ సెక్రటేరీయేట్లో ఫేషియల్ రిక్నగేషన్ అటెండెన్స్ విధానం అమల్లోకి వచ్చింది. సాంకేతిక ఇబ్బందులను అధిగమించేందుకు ప్రతి బ్లాకుకూ ఓ ఐటీ ఇన్ఛార్జ్ ని కూడా నియామకం చేసింది సర్కార్. ఇకపై సచివాలయం నుంచే విధులు నిర్వర్తించాలని అన్ని శాఖల అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
వసతుల్లేవని సాకులు చెప్పొద్దంటూ స్పష్టం చేసింది ఏపీ సర్కార్. ఏసీలు పని చేయడం లేదంటూ గతంలో రకరకాల కారణాలు చెప్పిన ఉన్నతాధికారులు… కరోనా కారణంగా గత రెండేళ్ల నుంచి హెచ్వోడీ కార్యాలయాల్లోనే విధులు నిర్వహిస్తోన్నారు ఉన్నతాధికారులు.
సెక్రటేరీయేట్టుకు ఉన్నతాధికారులు రాకపోవడంతో చాలా పనులు పెండింగులో ఉండిపోతున్నాయని ఏపీ సీఎస్సుకు వందల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. సచివాలయం నుంచే విధులు నిర్వహించాలని గతంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే మరిన్ని ఫిర్యాదులు అందడంతో తాజాగా ఆదేశాలు సీఎస్ సమీర్ శర్మ జారీ చేసారు.