వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు బిగ్ షాక్ తగిలింది. వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పై యాక్షన్ కు రంగం సిద్ధం చేశారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ హయాంలో జగనన్న కాలనీల పేరుతో జరిగిన భూ సేకరణ అవకతవకలపై విచారణ చేయాలని ప.గో జిల్లా కలెక్టర్ నాగరాణి కి డిప్యూటీ సీఎం పవన్ సూచనలు చేశారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/10/Grandhi-Srinivas-Pawan-Kalyan.jpg)
భీమవరం లో జగనన్న ఇళ్ల స్థలాల భూ సేకరణ కు సంబంధించి అక్రమాలు జరిగాయని పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదులు అందాయి. భీమవరంలో దాదాపు 140 ఎకరాల భూమిని మార్కెట్ ధర కంటే ఎక్కువ మొత్తానికి కొనుగోలు చేశారని ఆరోపణలు వచ్చాయట. దీంతో… వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పై యాక్షన్ కు రంగం సిద్ధం చేశారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ హయాంలో జగనన్న కాలనీల పేరుతో జరిగిన భూ సేకరణ అవకతవకలపై విచారణ చేయాలని ప.గో జిల్లా కలెక్టర్ నాగరాణి కి డిప్యూటీ సీఎం పవన్ సూచనలు చేశారు.